సి.సి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన జడ్పీ చైర్మన్ దావా వసంత
సారంగాపూర్ మండల ధర్మానాయక్ తండాలో రూ.10 లక్షల వ్యయం తో సిసి రోడ్డు పనుల నిర్మాణానికి శనివారం జడ్పీ చైర్మన్ దావ వసంత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలసి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం లబ్ధి దారులకు సీఎం సహాయ నిధి ద్వార మంజూరు అయిన చెక్కులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఎంపీపీ కొల జమున శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సురేందర్, సర్పంచ్ సంతోష్,
ఉప సర్పంచ్ నీలా రాజేష్ నాయకులు, రాజు నాయక్ జలపతి, రవి నాయక్, గంగాధర్, రాజన్న, తిరుపతి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.