విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ల చోరీ
మంథని మండలం ఏక్లాస్ పూర్ గ్రామ శివారులో మూడు విద్యుత్ ట్రాన్ ఫార్మర్ లను బుధవారం దొంగలు అపహరించారు. ట్రాన్ ఫార్మన్లను పగులగొట్టి అందులోని కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. గతంలో సైతం ఇదే విధంగా దొంగతనాలు జరిగినా ఎవరూ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వరుసగా చోరీలు జరుగుతే తాము పంటలకు సాగునీరు ఎలా అందించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.