రోడ్డు ప్రమాదంలో యువకడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట, ధర్మారం గ్రామాల మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. మృతుడు బావుసాయిపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల గణేష్ గా గుర్తించారు. మృతుడికి 15 రోజుల క్రితం ప్రేమ వివాహం జరిగినట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరు కోగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.