ఏ విధంగానైతే ఆర్జిత సేవలు నిలిపివేశారో అదేవిధంగా దర్గాను కూడా మూసి వెయ్యాలి: బిజెపి
వేములవాడలో ఈ నెల 18 న జరిగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కోసం ఆలయంలో ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేయడం జరిగిందని, అదేవిధంగా రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించే కోడెమొక్కులను చెల్లించుకునే ప్రాంతంలో ఉన్న దర్గాను భక్తుల సౌకర్యార్థం దేవాలయంలో ఐదు రోజులపాటు ఏ విధంగానైతే ఆర్థిక సేవలు నిలిపివేశారో అదేవిధంగా దర్గాను కూడా ఐదు రోజులపాటు మూసి ఉంచాలని మహాశివరాత్రి జాతర సమావేశంలో గురువారం జిల్లా కలెక్టర్ కు బిజెపి పార్టీ పక్షాన వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, సుదర్శన్ యాదవ్, రామతీర్థపు హరీష్ లు ఉన్నారు.