తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి యత్నించిన బీహార్ వాసి
జగిత్యాల పట్టణంలోని బాలాజీ నగర్ పార్క్ సంధి లో శుక్రవారం తాళం వేసి ఉన్న ఇంటి గేట్ తాళాన్ని బీహార్ కు చెందిన సంజీవ్ బండరాయితో పగలగొట్టి చోరీకి యత్నించాడు. స్థానికులు గమనించి నిందితున్ని పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవ్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.