గోదావరి నదిలో మునిగి యువతి మృతి
జగిత్యాల జిల్లా మేట్పల్లి మండలం వెల్దుల్ల గ్రామానికి చెందిన తంగలపల్లి స్వరూపరాణి (24) గురువారం ధర్మపురి శివారు గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్ళి నీట మునిగి మృతి చెందింది. మొక్కు చెల్లించడానికి ధర్మపురికి సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి గోదావరి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందింది