హిండెన్‌బర్గ్‌తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్!
హిండెన్‌బర్గ్‌తో పోరులో గౌతమ్ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు.
ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. హిండెన్‌బర్గ్ నివేదికతో ఆదానీ గ్రూప్‌నకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు న్యూయార్క్‌లో ప్రముఖ వాచ్‌టెల్, లిప్టెన్, రోసెన్, కట్జ్ సంస్థల్లోని సీనియర్ లాయర్ల సేవలను వినియోగించుకోనున్నారు. స్టాక్ మార్కెట్‌లో ఆదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడిదంటూ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటపెట్టిన నివేదిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
డీల్ జరిగింది అక్కడే
ఆదానీ గ్రూప్‌నకు అండగా ఉండే సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థలో కార్యాలయంలో వాచ్‌టెల్‌తో ఈ డీల్ జరినట్లు తెలుస్తోంది. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ సంస్థ అధినేత సిరిల్ ష్రాఫ్ కుమార్తెను గౌతమ్ ఆదానీ కొడుక్కి వివాహం చేసుకున్నారు. కార్పొరేట్ సంస్థల్లో తలెత్తే సంక్షోభాలను పరిష్కరించడంలో ఈ వాచ్‌టెల్ సంస్థకు విశేష నైపుణ్యం ఉంది.