పుట్ట లింగమ్మ ట్రస్ట్ నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన
పెద్దపల్లి జిల్లా :మంథని నియోజకవర్గం మండలాలని రుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది.
మంథని పట్టణంలోని ఎస్‌ఎల్బీ గార్డెన్స్‌లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంథని నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్ధులు హజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సుమారు 47 బహుళజాతి కంపెనీలు పాల్గొని విద్యార్హత ఆదారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 1800 మంది అభ్యర్ధులు వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా 1052మంది అభ్యర్ధులను ఆయా కంపెనీల హెచ్‌ఆర్‌లు ఎంపిక చేశారు. జాబ్‌మేళాలు ఉద్యోగాలు సాధించిన అభ్యర్ధులకు రూ. 15వేల నుంచి రూ.40వేల వేతనాలు ఆయా కంపెనీలు చెల్లిస్తాయని తెలిపారు..