ఎమ్మెల్సీ కవితకు పట్టువస్త్రాలు అందజేసిన చల్లా నారాయణ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కాటారం ఏఎంసీ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి *శ్రీ మహా మృత్యుంజయ జప సహిత యాగం* నిర్వహించారు. కాలేశ్వరం త్రివేణి సంగమ నది తీరంలో 12 మంది వేద పండితులతో యాగం నిర్వహించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతదేశ ప్రధానిగా కెసిఆర్ కావాలని, భారతదేశ ప్రజలందరికి వారి శక్తి సామర్థ్యాలతో భారతదేశ ప్రజలందరిని కంటికిరెప్పలా చూసుకోవాలని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా స్వామి వారి సన్నిధి, త్రివేణి సంగమ నది తీరాన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ మహా మృత్యుంజయ జప సహిత యాగం పురోహితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు.
సోమవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను* స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి మహా మృత్యుంజయ జప సహిత యాగ పట్టు వస్త్రాలు, ప్రసాదం, స్వామి వారి విబూదీని అందజేయడం జరిగింది.