నాంపల్లి గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం
వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన నాంపల్లి గుట్ట సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామానికి చెందిన గొర్రె శంకర్ గా స్థానికుల గుర్తించారు. క్షతగాత్రున్ని స్థానికులు సహాయంతో ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.