వేములవాడ రూరల్ ఎస్ఐకి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవార్డు
వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నాగరాజు కు జనవరి నెలకు గాను జిల్లాలో ఉత్తమ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అవార్డు రావటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వున్న పోలీస్ స్టేషన్ లలో ఉత్తమ పని తీరును కనబరిచిన వారికి ప్రతీ నెల అవార్డు లు ఇవ్వటం జరుగుతుందని, జనవరి నెల కు గాను ఉత్తమ ఇన్వెస్టిగేషన్ విభాగం లో ఎస్ఐ నాగరాజుకు, ఉత్తమ బ్లూ కోల్ట్ విభాగంలో సతీష్ కానిస్టేబుల్ కి, మొత్తంగా జనవరి నెలకు గాను రూరల్ పోలీస్ స్టేషన్ కి రెండు అవార్డులు వచ్చాయి. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. వీరిని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి, రూరల్ సిఐ బన్సీలాల్ అభినందించారు.