ప్రజల మన్ననలు పొందే లాగా పని చేయడం పోలీసు ప్రధాన లక్ష్యం
గురువారం పెద్దపల్లి డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఐ. పి. ఎస్ పెద్దపల్లి జోన్ అంతర్గాం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ఎస్ఐ డీసీపీ కి వివరించారు. అనంతరం డీసీపీ అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ప్రతిరోజు పోలీస్ స్టేషను పరిశుభ్రంగా ఉంచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసులు ప్రజలకు జవాబుదారీగా పని చేస్తూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఆన్ లైన్ వినియోగించు విధానముపై అందరికి అవగాహన ఉండాలని, టి ఎస్ సి ఓ పి ఎస్ ఆన్లైన్లో కేసుల వివరాలు నమోదు చేయడం మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ స్టేషన్ కి వచ్చే ప్రతి పిటిషన్ ను ఆన్లైన్లో నమోదు చేయాలని, బాధితుల నుండి వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. సాంకేతికంగా ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బ్లూ కోట్స్, పెట్రో కార్స్ నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని మరియు డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేయాలని, ప్రతిరోజు వారిని తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి పెండింగ్ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖల సమన్వయం తో చట్ట పరిధిలో పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలన్నారు. గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలతోపాటు యువతను అప్రమత్తం చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మహిళలపై అఘాత్యాలు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్ఐ సంతోష్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.