ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి
మహిళల ప్రపంచకప్ టీ20ల్లో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఆసీస్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఓడి ఇంటి బాట పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 173 రన్స్ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది. ఒక తరుణంలో గెలుపు సాధ్యం అనిపించినా వరుస వికెట్లు భారత్ కొంపముంచాయి. దీంతో ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచింది.