BRSకు షాక్.. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ భోగా శ్రావణి రాజీనామా చేశారు. అలాగే వార్డు కౌన్సిలర్ పదవి నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. మీడియా సమావేశంలో ఆమె కంటతడి పెట్టారు. మూడు సంవత్సరాల పదవీకాలంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. తన కుటుంబాన్ని ఎమ్మెల్యే బెదిరించారని ఆమె ఆరోపించారు.