బైక్ టైరులో చీర కొంగు చిక్కుకుని మహిళ మృతి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్ పల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న మహిళ వెనక టైర్ లో చీర కొంగు చిక్కుకుంది. ఈ ప్రమాదంలో మహిళా తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.
రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన జమున శుక్రవారం బైక్ పై వస్తున్న క్రమంలో జోగిన్ పెల్లి శివారులో బైకు వెనుక చక్రం లోకి ఆమె చీర కొంగు దూరడంతో కిందపడి తీవ్ర గాయాలు కాగా అపస్మారక స్థితికి చేరుకోవడం ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది,