చిన్న మెట్పల్లిలో ప్రజాగోస బిజెపి భరోసా
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో ఆదివారం ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్లో సురభి నవీన్ కుమార్ బిజెపి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నిటిది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని అలానే మన నియోజకవర్గంలో కూడా 100 రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్నారు.అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు,పెరిగిన పెన్షన్ ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు.నిరుద్యోగ భృతి ఇస్తామని మరిచిపోయినారు.ఇలా ఇచ్చిన హామీలన్నీ ఏది నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు కావున రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బిజెపి అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా అభ్యర్థించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ రావు,గ్రామప్రజలు,కార్యకర్తలు పాల్గొన్నారు.