భారత్ లోని కొన్ని సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. ఆయా బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం విధించిన కారణంగా.. ఖాతాదారులు కొన్నినెలలపాటు నగదు విత్ డ్రా చేసే అవకాశం లేదు. కొన్ని బ్యాంకులలో మాత్రం రూ.5 వేల వరకూ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆర్బీఐ నిషేధం విధించిన 5 సహకార బ్యాంకుల్లో ఏపీకి చెందిన బ్యాంకు కూడా ఉంది. హెచ్‌సీబీఎల్ కో- ఆపరేటివ్ బ్యాంక్ (లక్నో), ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్వాడిట్ (ఔరంగాబాద్), షింషా కో- ఆపరేటివ్ బ్యాంక్ నియమిత ( కర్ణాటక), ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్), శంకర్‌రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ (మహారాష్ట్ర) బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం ఉంది. వీటిలో ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, శంకర్ రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ కస్టమర్లు రూ. 5వేల వరకు విత్ డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మిగతా మూడు బ్యాంకులలో ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఖాతాదారులు తమ ఖాతాల నుండి డబ్బులను విత్ డ్రా చేసే వీలు లేకుండా పోయింది.
భారత్ లోని కొన్ని సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చర్యలు చేపట్టింది. ఆయా బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం విధించిన కారణంగా.. ఖాతాదారులు కొన్నినెలలపాటు నగదు విత్ డ్రా చేసే అవకాశం లేదు. కొన్ని బ్యాంకులలో మాత్రం రూ.5 వేల వరకూ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే.. ఆర్బీఐ నిషేధం విధించిన 5 సహకార బ్యాంకుల్లో ఏపీకి చెందిన బ్యాంకు కూడా ఉంది.
హెచ్‌సీబీఎల్ కో- ఆపరేటివ్ బ్యాంక్ (లక్నో), ఆదర్శ్ మహిళా నగరి సహకారి బ్యాంక్ మర్వాడిట్ (ఔరంగాబాద్), షింషా కో- ఆపరేటివ్ బ్యాంక్ నియమిత ( కర్ణాటక), ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ (ఆంధ్రప్రదేశ్), శంకర్‌రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ (మహారాష్ట్ర) బ్యాంకులపై ఆర్బీఐ నిషేధం ఉంది. వీటిలో ఉరవకొండ కో- ఆపరేటివ్ టౌన్ బ్యాంక్, శంకర్ రావ్ మోహితే పాటిల్ సహకార బ్యాంక్ కస్టమర్లు రూ. 5వేల వరకు విత్ డ్రా చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. మిగతా మూడు బ్యాంకులలో ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఖాతాదారులు తమ ఖాతాల నుండి డబ్బులను విత్ డ్రా చేసే వీలు లేకుండా పోయింది.