కుక్కల దాడిలో ఐదు మేకల మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తండాలో మాజీ సర్పంచ్ భూక్య అమున సీత్యా నాయక్ కు చెందిన ఐదు మేకలపై కుక్కలు దాడి బుధవారం హాతమార్చాయి. బ్రతుకుతెరువు కోసం ఎల్లారెడ్డిపేట కే డి సి సి బ్యాంకులో నాలుగు లక్షల రూపాయల అప్పు తీసుకుని గత నాలుగు సంవత్సరాల నుంచి మేకలను భూక్య అమున సీత్యా నాయక్ పెంచుకుంటున్నారు. తన ఇంటి బయట తాళ్లతో కట్టి ఉంచిన ఐదు మేకలను 10 కుక్కలు దాడి చేసి హతమార్చినయని దీంతో తాను 80000 నష్టపోయినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఎల్లారెడ్డిపేట మండలంలో కుక్కల బెడద తీవ్రమైందని మూగజీవాలపై దాడులకు తెగబడుతున్న కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్టీ సెల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భూక్యా సీత్యా నాయక్ ఎల్లారెడ్డిపేట జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావుకు విజ్ఞప్తి చేశారు.