రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన రౌడీ షీటర్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది చోటు చేసుకుంది. మృతున్ని కొమిరే వాసుగా పోలీసులు గుర్తించారు. సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం కాగా వాసును హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సీఐ ఉపేందర్, ఎస్ఐ లక్ష్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.