తారకరత్న పెద్దకర్మ.. అలేఖ్యకు ధైర్యం చెప్పిన బాలకృష్ణ
టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. ఆయన మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అటు ఫ్యాన్స్, సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గురువారం మార్చి 2, 2023న తారకరత్న పెద్దకర్మ హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కల్చరల్ సెంటర్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. తారకరత్న చిత్రపటానికిి నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయసాయి రెడ్డి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డితో బాలకృష్ణ మాట్లాడారు. అలేఖ్యను పరామర్శించిన బాలయ్య ధైర్యంగా ఉండాలని సూచించారు.