జూనియర్ ఎన్టీయార్‌కి ఘోర అవమానం.! బాలయ్యపై నెటిజన్ల సీరియస్..!!!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా సినీ రంగంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు లెగసీని నిలబెడుతున్నది జూనియర్ ఎన్టీయార్ మాత్రమే.! స్వర్గీయ ఎన్టీయార్ నట వారసుడు నందమూరి బాలకృష్ణ అయినప్పటికీ, జూనియర్ ఎన్టీయార్ స్టార్‌డమ్ వేరే లెవల్.!
అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది జూనియర్ ఎన్టీయార్ ఇమేజ్.!
కానీ, ఏం లాభం.? ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు.! జూనియర్ ఎన్టీయార్ మాత్రం ‘ఇంట’ గెలవలేకపోతున్నాడు. ‘ఇంట’ అంటే, తెలుగునాట కాదు, ఇండియాలో కాదు.. నందమూరి ఇంట్లో.! చాలాకాలంగా నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీయార్‌కి అవమానాలు ఎదురవుతున్నాయన్న చర్చ వుంది. ‘అబ్బే, అదేం లేదు’ అంటూ నందమూరి కుటుంబం కవరింగ్ ఇస్తుంటుంది.
కానీ, తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌ని తీవ్రంగా అవమానించాడు నందమూరి బాలకృష్ణ. జూ.ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ అలాగే సుహాసిని (హరికృష్ణ కుమార్తె) ఒక చోట కూర్చున్నారు. అటు వైపుగా వచ్చిన బాలకృష్ణ, అక్కడున్న వేరే వ్యక్తిని పలకించారు. బాలయ్య తమతో మాట్లాడతారేమోనని ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లేచి నిల్చున్నా, వారిని కనీసం బాలకృష్ణ పట్టించుకోలేదు.
వాస్తవానికి జూనియర్ ఎన్టీయార్ విదేశాలకు వెళ్ళి వుండాలి.. అదీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ రేసులో నిలబడిన దరిమిలా, అమెరికాలో జరుగుతున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకోసం. కానీ, కుటుంబంలో జరిగిన విషాద ఘటన (తారకరత్న) మరణం నేపథ్యంలో, కుటుంబ సభ్యుడిగా ఎన్టీయార్, అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నాడు.
కానీ, నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీయార్‌కి దక్కిన గౌరవమేంటి.? మరీ ఇంత అవమానమా.? అని జూనియర్ ఎన్టీయార్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య చేసిన అవమానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లోనే కాదు, రాజకీయ రంగంలోనూ స్వర్గీయ ఎన్టీయార్ లెగసీని నిలబెట్టే సత్తా కేవలం జూనియర్ ఎన్టీయార్‌కే వుంది. కానీ, ఆ జూనియర్ ఎన్టీయార్ మాత్రం నందమూరి కుటుంబంలో తగిన గౌరవాన్ని పొందలేకపోతుండడం శోచనీయం. నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీయార్‌కి ఎదురవుతున్న అవమానాలపై రెండు రోజుల క్రితమే.. తెలుగు బులెటిన్ డాట్ కామ్ ప్రస్తావించింది. అది నిజమని.. తాజా ఘటనతో నిరూపితమయ్యింది