కెసిఆర్ కప్ క్రికెట్ టోర్నీ లో భాగంగా ఈరోజు మ్యాచ్ ను ప్రారంభించిన ప్రారంభించిన పెద్దపల్లి ఎసిపి
కెసిఆర్ క్రికెట్ టోర్నమెంట్ 2023 లో భాగంగా ఈ ఆటను నిర్వహిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి పట్టణం లోని 25 వార్డు మరియు అల్లిపూర్ టీంల మధ్య మ్యాచ్ కు శుక్రవారం పెద్దపల్లి ఎసిపి మహేష్, సిఐ ప్రదీప్ కుమార్ లు ముఖ్య అతిథులుగా హాజరు అయి టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకోవడం జరిగింది.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎసిపి గారు మాట్లాడుతూ క్రికెట్ ఆటలో ఇరుజట్లు సంయమనం పాటించి స్నేహభావంతో ఆడాలని, ప్రతి క్రీడాకారుడు తమ టీం గెలవాలని కష్టపడి ఆడుతారు కానీ ఆటలో గెలుపోటములు సహజమని అన్నారు, క్రీడలు శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసనిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ నజీయ సుల్తానా-మోబిన్, కౌన్సిలర్స్ అశ్రప్, స్వామి, టిఆర్ఎస్ నాయకులు చొప్పరి అన్వేష్, దేవనంది నవీన్, సతీష్, నిశంత్ రెడ్డి తో పాటు పలువురు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు