విశాఖకు చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ
ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చిన ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అంబానీ వెంట 15 మంది బోర్డు డైరెక్టర్లు వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ప్రత్యేక కాన్వాయ్ లొ GIS సదస్సుకు అంబానీ బృందం బయలుదేరే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను అంబానీ మర్యాదపూర్వకంగా కలిశారు.