రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్ లో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎక్సెల్ వాహనంపై వెళ్తున్న వ్యక్తిని లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.