కుల మతాలకతీతం జగిత్యాల జిల్లా కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శనివారం కులమతాలకు అతీతంగా నిలిచి వారి భక్తిని చాటుకున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రతీకగా నిలిచారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి స్వయంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా. భక్తులు, నెటిజన్లు కలెక్టర్ ను అభినందించారు. సోషల్ మీడియాలలో ఆమె ఫోటోలను వైరల్ చేస్తు అభినందించారు.