అంతర్ జిల్లా ట్రాన్ఫర్మార్ల దొంగలు 9మంది అరెస్ట్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ మంథని పోలీసులు చాకచక్యంగా మూడు జిల్లాలలో 62 ట్రాన్స్ఫార్మర్ లు దొంగలించిన నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి నేరం చేసేందుకు ఉపయోగించిన వాహనాలతో పాటు 2. 70 క్వింటాళ్ల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నారు. శనివారం మంథని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ IPS. నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
ఈరోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మంథని ఎస్సై వెంకటేశ్వర్ అధ్వర్యంలో మంథని మండలంలోని ఎక్లాస్పూర్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన జైపూర్ మండలం లోని ఇందారం గ్రామానికి చెందిన మడిపెల్లి సాయి తేజ, దోనిపల్లి సురేష్, మీనుగు మల్లేష్ , రేగుంట వర్ధన్, చిప్పకుర్తి రాకేష్, పులి సిద్దు @ బరద్వాజ్, బానేష్ మరియు మరో ఇద్దరు మైనర్స్ లను అదుపులోకి తీసుకున్నారన్నారు. వారి వద్ద నుండి కాపర్ వైరు మరియు రెండు వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారన్నారు.