ఒక్కసారిగా బద్దలయిన భూమి.. రెండుగా చీలిపోయిన రోడ్డు.. (వీడియో)
అందరూ చూస్తుండగానే భూమి బద్దలయ్యింది. రోడ్డు రెండుగా చీలిపోయింది. సంచలన రేపిన ఈ ఘటన మహారాష్ట్ర లోని యావత్‌మాల్‌లో జరిగింది. మైందే చౌక్ నుండి ఆంగ్లో హిందీ హైస్కూల్ మార్గంలో మంచినీటి పైప్‌లైన్ బ్లాస్ట్ కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పేలుడు ధాటికి భూమి బద్దలయ్యింది. స్కూటీపై వెళ్తున్న మహిళ ఈ ఘటనలో గాయపడింది.
భూమి రెండుగా చీలిపోవడంతో అందరూ భూకంపం వచ్చిందని భయపడ్డారు. కాని పైప్‌లైన్ బ్లాస్ట్ అయ్యిందని తరువాత నిర్ధారణ అయ్యింది. పైపులో నుంచి వందల లీటర్ల నీరు రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఈ ఘటన అనంతరం నగరంలో సరైన నిర్వహణ లేని పైప్ లైన్ కారణంగా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారింది.