ప్రేక్షకుల మనసులను తాకిన ‘బలగం’.. విజయోత్సవ సంబరాల్లో డైరెక్టర్ వేణు కంటతడి..
కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం బలగం. జబర్దస్త్ హస్యనటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయన కుమార్తె హర్షిత రెడ్డి నిర్మించిన చిన్న .
ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, జయరాం, రూప లక్ష్మి, వేణు ఎల్దండి కీలకపాత్రలలో నటించారు. ఈ కథ మొత్తం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ గ్రామంలో జరుగుతుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఇందులోని పాటలన్నీ కాకర్ల శ్యామ్ రాశాడు. మార్చి 3న విడుదలైన ఈ కు పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ క్రమంలోనే బలగం సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ వేణు తన తొలి చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు. “ అందరినీ ఉద్వేగానికి గురిచేస్తున్నది. చివరి పది నిమిషాలు థియేటర్ మొత్తం సైలెంట్‌గా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
బలగం కు వస్తున్న ప్రతి రివ్యూ జన్యూన్‌గా రాసారని.. చాలా రోజుల తర్వాత మంచి వచ్చిందని తనకు సపోర్ట్ చేశారని అన్నారు. బలగం ను ఆదరించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అన్నారు. బలగం కు వస్తోన్న రెస్పాన్స్ చూసి ఇంత మంచి తీశానా నేను అనిపిస్తోందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.