ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన పోనుగోటి
ఎండపల్లి మండలంలోని ముంజపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ‘అభివృద్ధికి రూ. 50వేలు విరాళం రాష్ట్ర బి ఆర్ ఎస్ నాయకులు పోనుగోటి శ్రీనివాసరావు గౌడ సంఘం కులస్తులకు శనివారం అందజేశారు. మునుముందు ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. అనంతరం ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ పత్తిపాక వెంకటేష్, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు గెల్లు శేఖర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్, సర్పంచ్ లు పల్లె అశోక్, ధ్యానపల్లి లక్ష్మి ఎల్లయ్య, రామిల్ల లావణ్య సనీల్, శ్రీవాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము సంజీవ్, నాయకులు గాధం భాస్కర్, అనుమండ్ల తిరుపతి పాల్గొన్నారు.