కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నదిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దంపతులను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంతరం ఆంజనేయ స్వామి భక్తులతో కాసేపు ముచ్చటించారు.