చేపలు పడుతుండగా యువకుడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ఎల్లమ్మ కుంటలో ఆదివారం ముదిరాజ్ కులస్థుల చేపలుపడుతుండగా ఉప్పుల శ్రీకాంత్ (25) చేపలు పట్టి గడ్డకు వస్తున్న సమయంలో అనుకోకుండా నీటిలో మునిగిపోయి చనిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.