ఖనిలో ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు చిత్ర హీరో సందడి.!
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంత వాసి బిగ్ బాస్ ఫ్రేమ్ సినీ హీరో సోహెల్ నటించిన “ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు” చిత్రాన్ని గోదావరిఖని ఊర్వశి ధియేటర్ లో ఆదివారం ప్రేక్షకులు, అభిమానులతో కలిసి సినిమా చూసి సందడి చేశాడు. సోహెల్ చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోదావరిఖని ప్రాంత ప్రజలు అభిమానులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గోనగా, సోహెల్ తో సినీ అభిమాన సంఘాల ఐక్య వేదిక జిల్లా ఛైర్మన్ గుండేటి రాజేశ్, శామల శ్రీనివాస్, రాకేశ్, సాగర్, చంద్రశేఖర్, అభిమానులు సినిమా ను వీక్షించారు.