కాకతీయ కెనాల్ లో బీటెక్ విద్యార్థి గల్లంతు
శుభాకార్యానికి బంధువుల ఇంటికి వచ్చిన బీటెక్ విద్యార్థి కాకతీయ కెనాల్ లో గల్లంతైన ఘటన ఈదులగట్టెపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ బోయావాడకు చెందిన దొలి శ్రీనివాస్ ఇంట్లో శుభకార్యానికి వచ్చిన శ్రీనివాస్, ప్రసాద్, బద్రీనాథ్, జతిన్, రుషికేశ్లు కారులో సరదాగా తాటికల్లు కోసం ఈదుల గట్టేపల్లి కాకతీయ కెనాల్ సమీపంలోని శివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వెంట తెచ్చుకున్న తాటి కల్లు క్యాను, బాటిళ్లు పక్కన పెట్టి కెనాల్లోకి ఈత కొట్టేందకు లోపలి దిగారు.
ఈ క్రమంలో మురారి రుషికేశ్ (24), జతిన్ ఇద్దరూ నీటి మునిగిపోయారు. అప్రమత్తమైన సహచరులు జతిన్ ప్రాణాలను కాపాడగా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రుషికేశ్ అనే బీటెక్ విద్యార్థి కెనాల్ లో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, పైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం ఎస్సారెస్పీ అధికారులకు సమాచారం తెలియడంతో నీటిని నిలిపివేశారు. నీటీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో 24 గంటలు అయితే కానీ కెనాల్ లో నీరు తగ్గదని మానకోండూర్ సీఐ రాజుకుమార్ తెలిపారు.