గంగవ్వ కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారో తెల్సా..? ఆమె నోటితోనే చెప్పేసింది..
తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వ తెలియనివారు ఎవరూ ఉండరు. మోస్ట్ ఫేమస్ యూట్యూబర్ ఆమె. ఈ మధ్య ల్లో కూడా కనిపిస్తుంది. బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా వెళ్లి అందరికీ దగ్గరయ్యింది.
కాగా ఎలిమినేషన్ సమయంలో తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉందని నాగర్జునకు చెప్పడంతో.. తాను సాయం చేస్తానని హామి ఇచ్చారు హోస్ట్ నాగార్జున. తాజాగా ఆ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది గంగవ్వ. నాగార్జున తన కొత్త ఇంటికి 7 లక్షలు సాయం చేసినట్లు చెప్పింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్నందుకు 5 వారాలకు రెమ్యూనరేషన్ కింద 10 లక్షలు ఇచ్చారని వెల్లడించింది. మొత్తం ఇల్లు కట్టేందుకు 20 లక్షలు ఖర్చు అయిందని గంగవ్వ తెలిపింది. బిగ్ బాస్ అనంతరం.. తాను హైదరాబాద్ వెళ్లినప్పుడు ఓసారి నాగార్జున కలిసి.. మాట్లాడినట్లు వెల్లడించింది.
బిగ్ బాస్ ఇంట్లో ఉండటం అప్పట్లో తనకు అర్థం కాలేదని.. ఇప్పుడు అయితే మంచిగా ఉండేదాన్ని తెలిపింది. అక్కడ తిని, పడుకోవడమే పని అని.. వేరే పనేం లేకపోవడంతో తనకు ఇబ్బంది అనిపించిందని గంగవ్వ తెలిపింది. క్వారంటైన్ కింద.. ముందే 15 రోజులు హోటల్‌లో ఉంచడం వల్ల.. ఇంకొంచెం విసుగు వచ్చినట్లు తెలిపింది. తనకు నటన అంటే భయం లేదని.. కెమేరా ఫియర్ అస్సలు లేదని గంగవ్వ తెలిపింది.