ఈనెల 9న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ
ఈనెల 9న కరీంనగర్ పట్టణంలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా శాసన సభ్యురాలు దనసరి సీతక్క, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ దొమ్మటి సాంబయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేం. నరేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు బహిరంగ సభ జరుగనున్న అంబేద్కర్ స్టేడియంను సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించి మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా వారు ఇచ్చిన సందేశాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు చరవేసి క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన రీహాథ్ సే హాథ్ జోడో యాత్ర మహబూబబాద్, వరంగల్ పార్లమెంట్ లో ముగించుకొని కరీంనగర్ పార్లమెంటులోని ఆరు నియోజకవర్గాలలో పూర్తి చేసుకోవడం జరిగింది కరీంనగర్ అసెంబ్లీకి సంబంధించి ఈనెల 9న అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభను పురస్కరించుకొని నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర కొనసాగుతుంది ఈ బహిరంగ సభకు ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.
ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం 2009లో ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల మనసులో ఏముందో నాకు తెలుసునని, మీ ఆకాంక్షను నెరవేరుస్తానని వారు ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా పార్టీ ఎంత నష్టపోయినా ఈ కరీంనగర్ వేదికగా ఇచ్చిన మాటకు ఓకట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆస్ఫూర్తితోనే ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని, సోనియా గాంధీ కాకుండా వారి స్థానంలో ఎవరున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని అంత గొప్ప మహా నాయకురాలు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన ఈ అంబేద్కర్ స్టేడియంలో ప్రతి తెలంగాణ పౌరుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ రోజులను వారు కన్న కలలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మరొకసారి గుర్తు చేస్తూ చేస్తూ ఈ సభ నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని చంపేసినా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవలసిన బాధ్యత పౌరుషం గల ప్రతి తెలంగాణ పౌరుడు పై ఉందని, ఈ సభకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాటు సీఎల్పీ నాయకులు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మాజీ పిసిసి అధ్యక్షులు ఇతర రాష్ట్రాలకు చెందిన పిసిసి అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన బాధితులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, యువకులు మేధావులు విద్యావంతులు కార్మికులు కర్షకులు రైతులు ప్రజలందరూ ఈ సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీమతి. పారిజాత రెడ్డి, హైదరాబాద్ కొంపెల్లి కార్పొరేటర్ శ్రీమతి. జోష్నా రెడ్డి, జిల్లాకు చెందిన నాయకులు సత్తు మల్లేశం, వైద్యుల అంజన్ కుమార్, మేనేని రోహిత్ రావు, సమద్ నవాబ్, కమరుద్దీన్, శ్రావణ్ నాయక్,
అబ్దుల్ రహమాన్, లింగంపల్లి బాబు,ధను సింగ్ , ముక్క భాస్కర్, పోరండ్ల రమేష్, పులి కృష్ణ, షాహేన్షా తదితరు పాల్గొన్నారు.