రాష్ట్రంలో బిఆర్ఎస్ కేంద్రంలో బిజెపి రెండు తోడుదొంగలే : అంబటి జోజిరెడ్డి
రాష్ట్రంలో అధికారాంలో ఉన్న బిఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి పార్టీలు రెండు తోడుదోంగలే అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ భ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.బిజేపి ప్రభుత్వం పేదప్రజల కడుపుకోడుతూ ఆధానికి దోచి పెడుతున్నారని ఆ అంశం పై ఎందుకు బిజేపి నాయకులు నోరు విప్పడం లేదని ఆరోపించారు.కేంధ్ర ప్రభుత్వం,కేంధ్రంలో బోగ్గుగనులు కావోచ్చు, రైల్వే కావోచ్చు,ఫవర్ ఫ్లాంట్ కావోచ్చు,విమానాశ్రయాలు కావోచ్చు మీరు అధాని గుప్పిట్లో ఉంచిన ఇవాల్టి వరకు ఈడి సిబిఐ ఏం చేస్తేట్లు అని అన్నారు.అసలు ఇంత డబ్బు ఆదానికి ఎక్కడిదని విమర్శించారు. ఒకప్పుడు అప్పుల పాలై ఉన్న అధానికి ఒక్కసారిగా ఎనిమిది సంవత్సరాలలో లక్షల,కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని దుయ్యపట్టారు.
ఇప్పుడు ఇడి, సిభిఐ లు ఎం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం చిన్న,చిన్నవాటి పై దాడులు చేస్తారని, ఇడి,సిబిఐ ఇన్ కంటాక్స్ లు ఎమైనా మోడి,ఆధాని ల జేబు సంస్థల అని మండిపడ్డారు.ఆధాని వల్ల నష్ట పోయిన షేర్ హోల్డర్స్ తక్షణం ఆధాని ఎక్కడికి పారిపోకుండా పాస్ పోర్ట్ సీజ్ చేయాలన్నారు. ఇడి, సిబిఐ దాడులు చేసి ప్రజలకి ఆ సంస్థ యొక్క వివరాలు,డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని వేంటనే వాటి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఆధానికి దోచి పెట్టడానికి,గ్యాస్ ధరలు, పెట్రోల్,డిజిల్ ధరలు ,బస్ చార్జీలు, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతూ పెద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నీతి, నిజాయితి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరి చేసి శ్వేత పత్రం విడుదల చేయాలని అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు.
పెంచిన గ్యాస్,పెట్రోల్,డిజిల్,నిత్యావసర వస్తువులు పై వేసే జిఎస్ టి ల ధరలు తగ్గించాలన్నారు. ఇప్పటి కైన ప్రజలు మోల్కోని ఈ మత తత్వ బిజేపి నాయకులకు బుద్ది చేప్పే విధంగా ఈ రోజు నేతాజి సిధ్దాంతాలు వెలుగులోకి రావాలన్నారు. ఆరోజున నేతాజి సిధ్దాంతం ప్రకారం మీరు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్ర్యాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చిన నేతాజి స్పూర్తిని తీసుకురావలని పిలుపునిచ్చారు. ఓటు కు నోటు నోటుకు ఓటు అమ్ముకునే స్థితినుండి ప్రజలు బయటకి రావాలని కోరారు.మతంపిచ్చి,కులం,పిచ్చి మానుకోవాలని బిజేపి నాయకులు, మోడి, అమిత్ షా ఆధానిలకు ధేశ సంపద అప్పగించి మనల్ని బానిస బతుకులుగ చేస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.రాబోయె రోజులలో రాష్ట్రంలో అదికారంలో ఉన్న బిఆర్ఎస్ కు కేంద్రంలో ఉన్న బిజేపి పార్టీలకు ప్రజలు తమ ఓటు ద్వారా గుణపాఠం చేప్పాలని పిలుపునిచ్చారు.
నేతాజి కలలు కన్నా ఆశయాలు ప్రజలలోకి ఫార్వర్డ్ భ్లాక్ పార్టీ తీసుకువస్తుందని రాబోయె ఎన్నికలలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున పోటి చేస్తున్న అభ్యర్థులను మీ ఓట్ల ద్వారా గెలిపించి ప్రజావ్యతిరేఖ విధానాలకు పాల్పడుతున్న బిఆర్ఎస్, బిజేపి పార్టీలను బోంద పెట్టాలని అంబటి జోజిరెడ్డి పిలుపునిచ్చారు.