విమానం గాల్లో ఉండగానే డోర్ తీయబోయిన ప్యాసింజర్
లాస్ ఏంజిల్స్ నుంచి బోస్టన్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. విమానం కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుందనగా.. ఒక ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్ అయినట్లు అలారమ్ మెగడంతో అప్రమత్తమైన సిబ్బంది తనిఖీలు చేసి సరిచేశారు. డోర్ వద్ద ఉన్న వ్యక్తిని దీని గురించి అడగ్గా సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో విమానం ల్యాండ్ అయ్యాక ఎయిర్ పోర్ట్ అధికారులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.