Print Friendly, PDF & Email

నాలుగు సెకండ్లలో రూ. 40 లక్షలు మాయం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!

0 34,427

రిగ్గా నాలుగే నాలుగు సెకండ్లు పట్టలేదు వాళ్లకి.. ఏకంగా నలభై లక్షల రూపాయలు మాయాం చేశారు. బైక్‌పై డబ్బులతో వెళ్తున్న ఓ వ్యక్తిని ముగ్గురు ఫాలో అయ్యారు.

అంతే సిగ్నల్‌ క్రాసింగ్ దగ్గర మెల్లగా అతడి దగ్గరికి చేరుకుంటూ సెకండ్లలో డబ్బును దోచేశారు. ఆపై అక్కడి నుంచి ఏమి తెలియనట్లు వెళ్లిపోయారు. కాసేపటికి విషయం తెలిసి బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు..

Watch Video: నాలుగు సెకండ్లలో రూ. 40 లక్షలు మాయం.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..!

రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 38 లక్షలకు రికవరీ చేశారు. అయితే బాధితుడు అనీష్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను మహదేవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి రూ. 40 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బును తిరిగి నార్త్‌ ఎవెన్యూలోని ఒకరికి ఇవ్వడానికి వెళ్తుండగా ఈ చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఈ స్మార్ట్ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents