కొండగట్టులో మళ్ళీ చోరీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి దర్శనం కోసం వచ్చిన భక్తుల నగదు చోరీ చేసినట్టు తెలిసింది. మంగళవారం స్వామివారిని దర్శించుకుని వసతి గృహాల్లో బస చేసిన16, 17నంబర్ల గదుల్లో బస చేసిన పలువురు భక్తుల పర్సు లు సెల్ ఫోన్ లు చోరీకి గురైనట్టు సమాచారం.
కొండగట్టులో చోరీ జరిగిన కొద్ది రోజులకే దొంగలు మరోసారి చేతివాటం ప్రదర్శించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్టు చర్చ కనసాగుతుంది. ఆలయంలో భద్రత పెంచాలని భక్తులు కోరుతున్నారు.