మానేరు వాగులో చనిపోయిన ముగ్గురు పిల్లల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
హోళి పండుగ రోజు ముగ్గురు పిల్లల మృతి చెందడం బాధాకరం.ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పోలీసులకు , అధికారులకు మంత్రి గంగుల ఆదేశం..
మృతులు కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి గంగుల హామీ.. వారి కుటుంబాలకు మంత్రి గంగుల తరుపున మరో 2 లక్షలరూపాయలను అందజేస్తామని వెల్లడి
వివరాల్లోకి వెళ్తే …కరీంనగర్ జిల్లా అలుగునూర్ మానేర్ వాగులో రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో పడి ముగ్గురు యువకులు మృతి…
హోలీ సంబరాలు చేసుకొని స్నానానికి అలుగునూర్ మానేర్ వాగులోకి వచ్చిన యువకులు…
మృత్తులంతా ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందినవారు తల్లిదండ్రులు వలస కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు కరీంనగర్ లో…
మృతుల వివరాలు:
వీరాంజనేయులు 16
సంతోష్ 13
అనిల్ 14 సంవత్సరాలు