పెద్దపల్లి,మంచిర్యాల జిల్లా ప్రజలకు జిల్లా పోలీసు అధికారులకు పోలీస్ సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు.. రేమా రాజేశ్వరి*
రామగుండం: ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీమతి రెమా రాజేశ్వరి ఐపిఎస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
హోలీ వేడుకలను ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రంగులు చల్లుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని నింపి, రంగులమయం చేయాలని సీపీ మేడమ్ ఆకాంక్షించారు.
సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో హోలీ సంబరాల్లో పాల్గొని పోలీస్ అధికారులకు సిబ్బంది ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపీఎస్, మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్, జైపూర్ ఎసిపి నరేందర్, మంచిర్యాల ఏసిపి తిరుపతిరెడ్డి, బెల్లంపల్లి ఏసిపి సదయ్య, స్పెషల్ బ్రాంచి ఏసిపి మోహన్, సిసిఎస్ ఏసీపీలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, ఏ ఆర్ ఎస్ సి పి లు సుందర్ రావు, మల్లికార్జున్, సిసి ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లు, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కర్ణాకర్, కమిషనరేట్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు, రామగుండంకమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం, సిబ్బంది పాల్గొన్నారు.