రామగుండం ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచి పోయింది, కర్మాగారంలో ఏర్పడిన సాకేతిక లోపం వల్ల ఎరువుల కర్మ గారిని షట్ డౌన్ చేశారు. పునరుద్ధరణకు మరో నాలుగు రోజులు పట్టవచ్చునని ఎరువుల కర్మాగారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత పరిస్థితులు యూరియా కొరత ఉన్న నేపథ్యంలో రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి..