మానేరు వాగు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
కరీంనగర్ : హోలీ పండగ వేళ ప్రమాద వశాత్తు కరీంనర్ మానేరు వాగులో చనిపోయిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి గంగుల కమలాకర్ అండగా నిలిచారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 3 లక్షలు ఇస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించగా తన సొంత నిధుల నుండి మరో 2 లక్షలు మొత్తం 5 లక్షల పరిహారాన్ని చెల్లిస్తామని మంత్రి గంగుల ప్రకటించారు. ఇచ్చిన హామి మేరకు ఈ రోజు నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు కలెక్టర్ సమావేశ మందిరంలో అందించారు. చనిపోయిన పిల్లలను తాము తిరిగి తెచ్చి ఇవ్వలేమని, మా వంతుగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. హోళి పండుగ రోజు ముగ్గురు పిల్లల మృతి చెందడం బాధాకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు