నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎం ఆర్ఎఫ్ : మంత్రివర్యులు గంగుల కమలాకర్
నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు. నేడు మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో మంజూరైన 95లక్షల 41 వేల 500 విలువగల 257 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మంత్రి వర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన సిఫార్సు మేరకు నియోజకవర్గంలో 257 మంది లబ్దిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు
తెరాస ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్ సుంకిశాల సంపత్ రావు,భారాస నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ,ఎంపిటిసి తిరుపతి నాయక్,పిట్టల రవీందర్ పలువురు నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు