సీసీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో దాతల సహాయంతో ఏర్పాటు చేసిన 12 సీసీ కెమెరాలను కరీంనగర్ రూరల్ ఏసిపి కరుణాకర్ రావు ప్రారంభించారు. ఉల్లంపల్లి గ్రామం ఈ రోజు నుండి నిఘా నీడలా ఉంటుందని… గ్రామంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు జరిగినప్పుడు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏసిపి కరుణాకర్ తెలిపారు. మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎస్సై దాస సుధాకర్ చేస్తున్న కృషి అభినందనీయమని అయన అన్నారు.
అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషిచేసిన పోలీసు సిబ్బందిని, విరాళాలు అందించిన దాతలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సిఐ రమేష్,ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎంపీటీసీ రాగుల రమేష్, మాజీ సర్పంచ్ కొత్త కైలాసం, ఎం వి ఐ రవీందర్, సుద్ధగోని శ్రీనివాస్, జనవేని రమేష్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.