రంజాన్ ను శాంతియుతంగా పండగ వాతావరణంలో జరుపుకోవాలి : మంత్రి గంగుల కమలాకర్
మార్చ్ 23వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
నేడు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రంజాన్ సందర్భంగా ఏర్పాట్లపై పోలీసులు, ముస్లీం మత పెద్దలు, విశ్వ హిందు పరిషత్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రంజాన్ ను శాంతియుతంగా పండగ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు…
రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల సమయంలో మసీదుల వద్ద పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ పనులు చేయాలని,తాగునీరు ఉండేలా చూడాలని, నల్లా నీరు సమయానుసారం సరఫరా చేయాలని, వీధిదీపాలు వెలిగేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఆదేశించారు. కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు . నైట్ మార్కెట్లు, ఫ్రూట్, వెజిటేబుల్ మార్కెట్ లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హరీస్ స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు సహకారం అందజేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రంజాన్ పండుగను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు.
సీపీ సుబ్బ రాయుడు మాట్లాడుతూ ఉపవాస దీక్షలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలకు పోలీస్ శాఖ పక్షాన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలోకలెక్టర్ ఆర్వి కర్ణన్, సీపీ సుబ్బ రాయుడు అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ శ్యామ్ ప్రసాద్ లాల్,, , మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, , పోలీస్, రెవెన్యూ మున్సిపల్ అధికారులు, ఎంఐఎం పార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.