కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి
కరీంనగర్ లోని 17 వ డివిజన్ కార్పోరేటర్ కోల ప్రశాంత్ తల్లి శకుంతల ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారం కోల ప్రశాంత్ ను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావు. అనంతరం శకుంతల చిత్రపటానికి పూలమాల వేసి. శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.