అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న అధికారులు
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట్ శివారులో బుధవారం రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో అక్రమంగా లారీలో తరలిస్తున్న 29 గోవులను గుర్తించారు. వీటిని జగిత్యాల రూరల్ మండలం లోని తాటిపల్లి గోశాలకు తరలించారు.
ఈ కార్యక్రమంలో ఎం. వి. ఐ లు వంశీధర్, వెంకట్ రమణ, ఆర్టీసీ డి. ఎం వెంకట నర్సప్ప, పాల్గొన్నారు. నాగ్ పూర్ కు చెందిన లారీ డ్రైవర్ మహబూబ్ ఖాన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ అనిల్ తెలిపారు.