మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి
కరీంనగర్ లోని 19 వ డివిజన్ రేకుర్తిలో స్వయం కృషి మహిళా సమాఖ్య నూతన భవనాన్ని బుధవారం మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పొరేటర్లు సుధగోని మాధవి. కృష్ణగౌడ్, ఏదుళ్ళ రాజశేఖర్, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.