మహిళా మణులతో సమావేశమైన కార్పొరేటర్
కరీంనగర్ పట్టణంలోని 32 వ డివిజన్ కు సంబంధించిన “ధరణి ” అను మెప్మా మహిళా సమాఖ్య కు రిసోర్స్ పర్సన్ వలన కలిగిన సమస్యలను తెలుసుకొని “శ్రీనిధి” సంస్థ కు అనుసందానంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చర్చించడం జరిగింది. ఇట్టి చర్చ లొ కార్పొరేటర్ మఱ్ఱి భావన సతీష్, శ్రీనిధి మానేజర్ సౌజన్య, సమాఖ్య లీడర్లు, మెంబర్లు పాల్గొన్నారు. ఆడపడుచులందరు ముఖ్యంగా మహిళ సంఘాల సభ్యులు గమనించగలరు మీరు కట్టె ప్రతి రూపాయికి మీ వద్ద మీ బుక్ లో రాపించుకొని సంతకం చేయించుకోవాలి బుక్ ను మీవద్దనె ఉంచుకోవాలి. ప్రతి సభ్యురాలు అప్పుడప్పుడు లీడర్ల తో పాటు బ్యాంకు వెళ్ళి లావాదేవీలు చూసుకోవాల్సిందిగా కోరుతున్నామని కార్పొరేటర్ భావన తెలిపారు.